Saturday, July 5, 2025
E-PAPER
Homeసినిమా'మిస్టీరియస్‌'.. ఆద్యంతం ఆసక్తికరం

‘మిస్టీరియస్‌’.. ఆద్యంతం ఆసక్తికరం

- Advertisement -

అలనాటి నటుడు నాగభూషణం మనవడు అబిద్‌ భూషణ్‌ హీరోగా, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ రోహిత్‌ సహాని హీరోయిన్‌గా వస్తున్న చిత్రం ‘మిస్టీరియస్‌’. ఆష్లీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. రియా కపూర్‌, మేఘనా రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్‌ ఘనంగా లాంచ్‌ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్‌ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ, ‘సస్పెన్స్‌ జోనర్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్‌కి సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. తాజాగా టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో సినిమా సక్సెస్‌ పై మరింత కాన్ఫిడెన్స్‌ పెరిగింది’ అని అన్నారు.
‘సినిమాని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించాం. టీజర్‌ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ వచ్చాయి. వాటితో పోలిస్తే మా సినిమా చాలా వినూత్నంగా ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకుల్ని సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. ఫ్యూచర్లో కూడా మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తాం’ అని నిర్మాతలు ఉషా, శివాని తెలిపారు. నాయకానాయికలు అబిద్‌ భూషణ్‌, రోహిత్‌ సహాని మాట్లాడుతూ, ‘ఇంతమంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్‌, ప్రొడ్యూసర్స్‌కి చాలా థ్యాంక్స్‌, ఇప్పటికే రిలీజ్‌ అయిన రెండు పాటలు మంచి టాక్‌ తెచ్చుకోవడంతో పాటు టీజర్‌కి కూడా మంచి అప్లాజ్‌ రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. బలరాజ్‌ వాడి (కన్నడ నటుడు), ఆకునూరి గౌతమ్‌,భోగిరెడ్డి శ్రీనివాస్‌, రాజమౌళి(జబర్దస్త్‌), గడ్డం నవీన్‌ (జబర్దస్త్‌), లక్ష్మి, వేణు పోల్సాని తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి, నిర్మాత: జరు వల్లందాస్‌, పాటలు- సంగీతం: రాజా, కెమెరా – ఎడిటింగ్‌: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా), ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రామ్‌ ఉప్పు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -