Monday, November 24, 2025
E-PAPER
Homeసినిమామైథలాజికల్‌ థ్రిల్లర్‌ 'వృషకర్మ'

మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘వృషకర్మ’

- Advertisement -

‘తండేల్‌’ వంటి భారీ ఘనవిజయం అందుకున్న తరువాత నాగ చైతన్య ఓ మైథలాజికల్‌ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ‘విరూపాక్ష’తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న దర్శకుడు కార్తీక్‌ దండుతో చేస్తున్న ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్‌విసిసి, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. రెండు ఆసక్తికరమైన గ్లింప్స్‌తో భారీ అంచనాలను సృష్టించిన తర్వాత నాగ చైతన్య పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్‌ ఇప్పుడు సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. అగ్ర కథానాయకుడు మహేష్‌ బాబు తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. టీం అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెట్టారు. వృషకర్మ అంటే కార్యసాధకుడు అని అర్థం.

ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో నాగ చైతన్య చేతిలో రాడ్‌ పట్టుకుని ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. అతని చుట్టూ ఉన్న విజువల్‌ ఎగిరే ధూళి, పొగతో నిండి పవర్‌ఫుల్‌ యాక్షన్‌ని సూచిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో పురాతన భవనాలు, ప్రకాశవంతమైన బంగారు కాంతితో కూడిన ఆకాశం కనిపించడం క్యురియాసిటీ మరింతగా పెంచింది. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు చైతూ.. ‘వృషకర్మ’ చాలా సాలిడ్‌గా కనిపిస్తోంది… సినిమా కోసం ఎదురు చూస్తున్నాను’ అని మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు. టైటిల్‌ రివీల్‌ ప్రేక్షకుల అంచనాలను కేవలం చేరడమే కాదు, వాటిని దాటి మరింత భారీ స్థాయి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రామిస్‌ చేస్తోంది. కార్తిక్‌ డండు తన ప్రత్యేకమైన హిస్టరీ, పౌరాణిక జోనర్‌లో కలిపి రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తిగా కొత్తగా, ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని లుక్‌లో అలరించనున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, లాపతా లేడీస్‌ ఫేమ్‌ స్పర్శ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -