జేపీ నడ్డా, అమిత్ షా హాజరు
న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ఢీల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మధ్యాహ్నం పాట్నా నుంచి ఢిల్లీ చేరుకున్న నితిన్ నబీకి దిల్లీ విమానాశ్రయంలో సీఎం రేఖా గుప్తా స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న నితిన్ నబీ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ విగ్రహాల వద్ద పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. తర్వాత నితిన్ నబీని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా స్వయంగా తొడ్కొని వెళ్లి కుర్చీలో కూర్చొబెట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పుష్పాలు అందించిన కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నబీన్ సిన్హా బాధ్యతల స్వీకరణ
- Advertisement -
- Advertisement -



