- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా శనివారం నాగుల చవితి వేడుకలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం ఆరు గంటల నుండి మొదలుకొని మహిళలు కుటుంబ సభ్యులతో పాటు సమీపంలోని పొలాలు చెరువు గట్ల మీద కాలువ గట్ల మీద ఉన్న మొలిచిన పాము పుట్టలను శుభ్రం చేసి నీటితో అలికి ముగ్గులు వేసి పూలతో అందంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పాము పుట్టాలను భక్తిశ్రద్ధలతో పూజించారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి సర్ప దోషాలు ఉన్న తొలిగిపోతాయన్న లక్ష్యంతో నాగుల చవితి పర్వదినాన జంటనాగులకు పూజారి కార్యక్రమాలను నిర్వహించారు. నాగ ఆలయంలోకి వెళ్లి పాలాభిషేకం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
- Advertisement -



