యూకీ బాంబ్రికి సైతం చోటు
న్యూఢిల్లీ : భారత యువ టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నాగల్ సుమారు రెండేండ్ల తర్వాత డెవిస్ కప్ బరిలోకి దిగనున్నాడు. చివరగా 2023 లక్నోలో మొరాకోపై డెవిస్ కప్ పోరులో తలపడిన సుమిత్ నాగల్.. మళ్లీ స్విట్జర్లాండ్‌తో పోరుకు జట్టులోకి వచ్చాడు. సెప్టెంబర్ 12న ఇండోర్ కోర్టులో జరుగనున్న పోరులో స్విట్జర్లాండ్, భారత్‌లు తలపడనున్నాయి. వరల్డ్‌గ్రూప్1 ఫస్ట్ రౌండ్ టైలో భాగంగా స్విట్లర్లాండ్‌లో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎనిమిది మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రి సైతం భారత డెవిస్ కప్ జట్టులో నిలిచాడు. డెవిస్‌కప్‌లో భారత్, స్విట్జర్లాండ్‌లు మూడుసార్లు తలపడగా.. భారత్ రెండింట విజయాలు నమోదు చేసింది.
భారత డెవిస్‌కప్ జట్టు
సుమిత్ నాగల్, కరణ్ సింగ్, ఆర్యన్ షా (సింగిల్స్). యూకీ బాంబ్రి, ఎన్. శ్రీరారామ్ బాలాజీ (డబుల్స్). సురేశ్, శశికుమార్ ముకుంద్, రిత్విక్ (రిజర్వ్ ప్లేయర్స్).
డెవిస్ కప్ జట్టులో నాగల్
- Advertisement -
- Advertisement -