నవతెలంగాణ-హైదరాబాద్ : నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ అయ్యర్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఈనెల 8న చెన్నైలోని టి.నగర్లో ఆయన ఇంట్లో జారిపడగా.. తలకు తీవ్ర గాయం అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి గణేషన్ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
16 ఫిబ్రవరి 1945న జన్మించిన గణేశన్ తన సుదీర్ఘ రాజకీయ కెరీర్‌లో భారతీయ జనతా పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు. మధ్యప్రదేశ్ నుచి నజ్మా హెప్తుల్లా స్థానంలో రాజ్యసభలో తొలిసారి అడుగుపెట్టారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా సేవలందించారు. ఫిబ్రవరి 2023లో నాగాలాండ్ గవర్నర్‌గా నియమితులైన గణేశన్.. అంతక ముందు మణిపూర్ గవర్నర్‌గా సేవలందించారు. అలాగే కొద్దికాలం వెస్ట్ బెంగాల్‌కు గవర్నర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.