– 70 ఏళ్ల వయస్సులో సర్పంచ్ గా గెలిచి రికార్డు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని నాగపూర్ తాజా మాజీ సర్పంచ్ పాలెపు సాయమ్మ మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. 70 సంవత్సరాల వయస్సులో సాయమ్మ నాగపూర్ సర్పంచ్ గా విజయం సాధించి, జిల్లాలోని అత్యంత వయసు ఉన్న సర్పంచ్ గా ఆ సమయంలో రికార్డు నెలకొల్పారు.2018 సంవత్సరంలో ఆరు బయట మల విసర్జన రహితంలో, గ్రామపంచాయతీ కార్యక్రమాల అమలులో కేంద్ర ప్రభుత్వం నుండి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్, స్వశక్తి కరణ పురస్కారాన్ని, రూ. మూడు లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకొని ఆదర్శంగా నిలిచారు.కుటుంబ సభ్యుల, బిఆర్ఎస్ పార్టీ నాయకుల అశ్రునయనాల మధ్య సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
నాగాపూర్ తాజా మాజీ సర్పంచ్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



