నవతెలంగాణ – రాజోలి
రాజోలి మండల పరిధిలోని మాన్ దొడ్డి గ్రామంలో శనివారం రోజు నాగార్జున కంపెనీ ఆధ్వర్యంలో రైతుల కోసం అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వరి పత్తి మిర్చి పంటలలో ఉపయోగించే అధునాతన ఉత్పత్తులైన ఆస్కార్ అటానిక్ గ్యాలెంట్ ఫాస్ట్ స్ప్రెడ్ ఇండెక్స్ లాంటి మందుల గురించి కంపెనీ ప్రతినిధులు సమగ్రమైన వివరణ ఇచ్చారు. చిన్న ధన్వాడ నూసనూర్ మాన్ దొడ్డి గ్రామాల నుంచి వచ్చిన సుమారు 150 మంది రైతులు ఈ సదస్సులో పాల్గొని కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా ఆలకించారు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటలకు సమయానుసారంగా మందుల వినియోగం వల్ల కలిగే లాభాల గురించి వివరించబడింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీమతి సురేఖ జోగులాంబ గద్వాల టెర్రిటరీ మేనేజర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ సీనియర్ రీజియన్ మేనేజర్ కిషోర్ బాబు మరియు హైదరాబాద్ రీజియన్ ఇంచార్జ్ ఏరియా డెవలప్‌మెంట్ మేనేజర్ దినేష్ పాల్గొన్నారు.
మాన్ దొడ్డిలో నాగార్జున కంపెనీ అవగాహన సదస్సు
- Advertisement -
- Advertisement -



