- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాలు నెమ్మదించడంతో నాగార్జున సాగర్ డ్యాంకు ఎగువ నుండి వచ్చే వరద ఉధృతి తగ్గింది. దీంతో ఆదివారం అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్టు గేట్లను మూసేశారు. అయితే, 18 ఏళ్ల తర్వాత తొలిసారి జులైలో ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో సాగర్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు మూసివేయటంతో ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాల్సిందిగా అధికారులు సూచించారు. వరద ఉధృతిని బట్టి నీటిని విడుదల చేస్తామన్నారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులగా ఉంది. ఇన్ ఫ్లో : 48,082 వేల క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో : 48,082 వేల క్యూసెక్కులు కాగా, గరిష్ట నీటిమట్టం: 590 అడుగులకు చేరింది.
- Advertisement -