Thursday, November 13, 2025
E-PAPER
Homeక్రైమ్మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువునష్టం దావా విచారణ వాయిదా

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై విచారణ వాయిదా పడింది. విచారణను ప్రజాప్రతినిధుల కోర్టు డిసెంబర్ 2కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ నడుస్తోంది.

ఈ క్రమంలో ఇవాళ విచారణకు రాబోతోంది అనగా మంగళవారం అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా వేదికగా నాగార్జునకు క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తనకు నాగార్జునను గానీ ఆయన కుటుంబాన్ని గానీ కించపరిచే ఉద్దేశం లేదని ఆ ట్వీట్‍లో పేర్కొన్నారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు వెల్లడించారు.

ఇవాళ కోర్టులో పరువు నష్టం దావాపై విచారణకు ముందు కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేయడం ఆసక్తిగా మారింది. అయితే కోర్టు ఈ దావాపై విచారణ వచ్చే నెలకు వాయిదా వేయడంతో అసలు ఈ కేసులో ఏం జరగబోతోందని అనేది ఉత్కంఠ రేపుతోంది. కొండా క్షమాపణలతో నాగార్జున ఈ కేసును విత్ డ్రా చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -