- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికై మిర్యాలగూడకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాగేశ్వర్ రావ్ అభినందనీయుడని మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ బి.బలరాం యాదవ్ అన్నారు. శనివారం స్థానిక కార్యాలయంలో ఇటీవల జాతీయ స్థాయి అవార్డ్ కు ఎంపికైన సందర్భంగా సన్మానించి మాట్లాడారు. భవిష్యత్ లో నాగేశ్వర్ రావ్ మరిన్ని అవార్డులు స్వీకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో బీసీ జేఏసీ నాయకులు చేగొండి మురళీ యాదవ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



