సంతాపసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-నయీంనగర్
సీపీఐ(ఎం) ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు యూ. నాగేశ్వరరావు మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ అన్నారు. సోమవారం సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన నాగేశ్వరరావు సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. నాగేశ్వరరావు మరణాంతరం కూడా ప్రజలకు ఉపయోగపడేలా అతని దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అవయవ దానం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. వ్యక్తిగత జీవితం ముగిసిన తర్వాత కూడా ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆయన ఆలోచన నేటి సమాజానికి అత్యంత అవసరమైన మానవీయ విలువలను చాటుతుందని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంవీ రమణ, ఎస్వీ రమ, ఉడుత రవీందర్ మాట్లాడుతూ.. నాగేశ్వరరావు జీవితాంతం పేదల హక్కులు, కార్మిక వర్గ సమస్యలు, దోపిడీకి వ్యతిరేక పోరాటాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేశారని గుర్తు చేశారు. వ్యక్తిగత లాభాలకంటే సమాజ హితాన్నే ముఖ్యంగా భావించి పార్టీకి, ఉద్యమాలకు సేవలందించిన కమ్యూనిస్టుగా ఆయన జీవితం నిలిచిందన్నారు.
నాగేశ్వరరావు కృషి మరువలేనివి : పలు జిల్లాల పార్టీ కార్యదర్శులు, వక్తలు
సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు శశిధర్, రవి, జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజు, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, బాలరాజు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎదునూరి వెంకట్రాజం, సీపీఐ ఎమ్మెల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నున్న అప్పారావు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు గండం శివ, సంపత్‌రావు, అవయవదానం ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు చరణ్, జిల్లా అధ్యక్షులు శంకరయ్య, టీఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకులు భిక్షపతి, రమేష్, ఏఐటీయూసీ నాయకులు ధర్మరాజు, ఎంసీపీఐ, బీఎస్పీ, ఇతర పార్టీల నేతలు మాట్లాడారు.
హనుమకొండలో అంతిమయాత్ర
అంతకుముందు నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యాలయం నుండి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఎర్రజెండాలతో, విప్లవ నినాదాలతో ఈ యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యం .చుక్కయ్య, బోట్ల చక్రపాణి, రాగుల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు టి.ఉప్పలయ్య, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, జి.రాములు, మంద సంపత్, డి.భాను నాయక్, కె. లింగయ్య, నాయకులు ఓరుగంటి సాంబయ్య, గాదె రమేష్, డి.రాజేందర్, నరేష్, రమేష్, రాజు వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
నాగేశ్వరరావు మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



