నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని నాగపూర్ క్రికెట్ టోర్నమెంట్ సేవలాల్ సేన మండల అద్యక్షులు జాదవ్ ప్రకాష్ నాయక్ ఆధ్వర్యంలో ఆడెల్లి పోచమ్మ మైదానంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్బంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి మాట్లాడారు. యువత చదువుతో క్రీడల్లో రాణించాలి క్రీడలతో మానసిక ఉల్లాసం తోపాటు శారీరక దారుఢ్యం మెరుగు పడతాయని అన్నారు. మొదటి బహుమతి రూ. 30 వేలు,రెండవ బహుమతి రూ. 15 వేలు, మూడవ బహుమతి రూ.9 వేలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా ..క్రీడా కారులకు స్పోర్ట్ టి షర్టు లను ప్రధానం చేసారు. ఈ కార్యక్రంలో నాగపూర్ సర్పంచ్ జాదవ్ లలిత బాయి కైలాస్, మార్కెట్ చైర్మన్ మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భోల్లోజి నర్సయ్య, సేవలాల్ సేన జిల్లా అద్యక్షులు పవార్ రాజేష్, సర్పంచుల సంఘం అధ్యక్షులు జాదవ్ దిలీప్,ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నాగపూర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



