Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగులమ్మ తల్లి జాతర పోస్టర్ ఆవిష్కరణ..

నాగులమ్మ తల్లి జాతర పోస్టర్ ఆవిష్కరణ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మేడారంలో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ మహజాతర నేపథ్యంలో మండలంలోని కొయ్యుర్ గ్రామ పరిదిలోని అటవీప్రాంతంలోని కోయకుంట్ల నాగులమ్మ తల్లి జాతర ఆనవాయితీగా నిర్వహించనున్నారు. వన దేవతల దర్శనానికి వేలమంది భక్తులు నాగులమ్మ తల్లి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా నాగులమ్మ ఆలయం ఆవరణలో నాగులమ్మ తల్లి జాతర పోస్టర్ ను ఆదివారం గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ అధ్యక్షతన నాయకపోడు సేవా సేవ సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.

జాతర ఈ నెల 21, 22, 28, 39 తేదీల్లో జరగనున్నట్లుగా తెలిపారు. ఈ జాతరమహోత్సవానికి ముఖ్యదితులుగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, కాటారం సిఐ నాగార్జున రావు, మాజీ జెడ్పిటిసి అయిత కోమల-రాజిరెడ్డి, కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు కండేల స్వామి, బొడ్డు రమేష్, జంగం భాపు, కూన పోచం, కండేల లస్మయ్య, కోట మధునయ్య, జంగ పెదనారాయణ, కస్తూరి సంజీవ్, కొత్తపెల్లి మధుకర్,కండేల మంతేష్, గుంటి రాజయ్య, కొత్తపెల్లి అజయ్, చితకుంట గణేష్, జంగ దేవేందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -