ఉత్సాహంగా సాగిన ఎన్నికల ప్రక్రియ
సాధారణ ఎన్నికల వలే పోలింగ్ నిర్వహణ
నూతన అధ్యక్షులుగా వినోద్ కుమార్
నూతన కార్యదర్శిగా నర్సింగ్ రావ్ ఎన్నిక
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
పట్టణంలో కుల సంఘ ఎన్నికల సందడి నెలకొంది. నకాష్ సంఘం ఆదిలాబాద్ 2026 సంవత్సరానికి సంబంధించిన ఎన్నికలను ఆదివారం సంఘ భవనంలో నిర్వహించారు. సాధారణ ఎన్నికల వలె సంఘం ఎన్నికలను నిర్వహించి ప్రశాంత వాతావరణంలో పూర్తిచేశారు. ఉదయం ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఫలితాలతో ముగిసింది. రెండు ప్యానల్ లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శికి ఎన్నికకు గాను బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం పర్శరౌతు వినోద్ కుమార్, బ్రహ్మారౌతు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పదవి కోసం గాజర్ల నర్సింగ్ రావు, పర్శరౌతు రాము బరిలో నిలిచారు. హోరాహోరీగా సాగిన పోలింగ్ లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ నాయకుడికి ఓటు వేస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇందులో పర్శ రౌతు వినోద్ కుమార్ 102 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రత్యర్థి మీద 47 ఓట్ల మెజారిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే గాజర్ల నర్సింగ్ రావ్ కు 106 ఓట్లు పోల్ కాగా 56 ఓట్ల మెజార్టీతో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన వీరిని సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్టిఫికెట్ లను అందించారు. కార్యక్రమంలో విలాస్, నవీన్ వర్మ, శ్రీనివాస్, ప్రకాష్, సురేష్ చౌదరి పాల్గొన్నారు.



