పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు సారయ్య
నవతెలంగాణ – పాలకుర్తి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యువకుడు, పద్మశాలీల ముద్దుబిడ్డ నల్ల నరసింహులు 32వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు మాచర్ల సారయ్య పద్మశాలి సంఘం నాయకులతోపాటు బిసి సంఘాల నాయకులను కోరారు. మంగళవారం సారయ్య మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి నల్లా నరసింహులని కొని ఆడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నల్ల నరసింహులు పోరాటానికి ప్రత్యేక చరిత్ర ఉందని తెలిపారు. పాలకుర్తి ప్రాంత ప్రజల హృదయాల్లో నల్ల నరసింహులు చిరస్మరణీయుడని అన్నారు. నల్ల నరసింహులు పోరాట స్ఫూర్తిని పునికి పుచ్చుకునేందుకు పాలకుర్తిలో నల్ల నర్సింహులు కాస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నేడు జరిగే నల్లా నరసింహులు వర్ధంతి వేడుకలను విజయవంతం చేసేందుకు పద్మశాలీలతో పాటు బీసీ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సారయ్య కోరారు.
నల్లా నరసింహులు 32వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -



