కరస్పాండెంట్ భార్య పేరుతో పాలసీ అగ్రిమెంట్ జారీ
ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు టార్గెట్లు
చదువు ఎప్పుడు చెబుతారు? – పాలసీలు ఎప్పుడు చేర్పిస్తారు?
అది అసలు పాఠశాలా? పాలసీల వ్యాపార సంస్థ
యాజమాన్యం, ప్రిన్సిపాల్ వేధింపులతో వెలుగులోకి
నిత్యం తీవ్ర వివాదంలో “షైన్ హై స్కూల్”
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్ మండల కేంద్రంలో అది ఒక విద్యా సంస్థ. విద్యాసంస్థ అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పేది. ఇందుకోసం యాజమాన్యం ఉపాధ్యాయులను నియమించుకుంది. ఈ ఉపాధ్యాయులను విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే నియమించుకున్నారనేది జగమెరిగిన సత్యం. కానీ ఆ పాఠశాలలో విద్యాబోధనతో పాటు విద్యాశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉపాధ్యాయులకు పాలసీల పేరుతో టార్గెట్ నిర్ణయించి జీతాలు ఇస్తున్నారు. టార్గెట్ పూర్తి చేయని ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని పదిమంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్యకు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేశారు.
ఏకంగా 10 మంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మండల విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన షైన్ హై స్కూల్ యాజమాన్యంపై నేటి వారికి విద్యాశాఖ పరంగా చర్యలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోది. మహిళ ప్రిన్సిపాల్ అయిటిపాముల శ్వేత యాజమాన్యం మెప్పు కోసం మహిళా ఉపాధ్యాయురాలను వివిధ రకాలుగా వేధింపులకు గురి చేసేదని ఉపాధ్యాయురాలు తెలిపారు. మహిళ అయి ఉండి కూడా మహిళలను వేధింపులకు గురి చేశారని ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో యాజమాన్యం కంటే ప్రిన్సిపాల్ శ్వేత వేధింపులే భరించలేనివిగా ఉండేవనే ఆరోపణలు కూడా ఉన్నాయి.విద్యాసంస్థల పాలసీలు పెట్టడం అనేది పెద్ద నేరం. అంతట నేరానికి షైన్ హై స్కూల్ యాజమాన్యం పాల్పడి, ఆధారాలు దొరికిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం, కనీసం ఎటువంటి ప్రకటనలు కూడా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
షైన్ హై స్కూల్ కరస్పాండెంట్ తన ఫోటోతో పాలసీ బ్రోచర్ ను విడుదల చేసి ఆ విధంగా విద్యార్థుల వద్ద నుంచి పాలసీ టార్గెట్ ఒక లక్ష రూపాయలు. ఆ లక్ష రూపాయలు సాధ్యం కాకపోతే రూ. 50,000 రూపాయలు పాలసీ కూడా చెల్లించవచ్చు. ఈ విధంగా షైన్ హై స్కూల్ విద్యాసంస్థ పేరుతో ప్రభుత్వ అనుమతి లేకుండా, విద్యాశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా విద్యార్థుల నుంచి పాలసీలను సేకరిస్తున్న విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఆ విధంగా దర్యాప్తు చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాలసీల పేరుతో వేధింపులు, జీతాలు సక్రంగా ఇవ్వకపోవడం, మహిళా ఉపాధ్యాయుల సెల్ ఫోన్లను షైన్ హై స్కూల్ యాజమాన్యం తనిఖీ చేయటం తదితర కారణాలతో పదిమంది ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం పెద్ద ఎత్తున అనుమానాలు తావిస్తోంది. షైన్ హై స్కూల్ యాజమాన్యం బాగోతం బయటపడటంతో అబ్బెబ్బె తాము విద్యార్థులకు పాలసీ పెట్టలేదని, ఉపాధ్యాయులకు పాలసీల టార్గెట్ పెట్టలేదని యాజమాన్యం బొంకుతుంది.
బోనకల్ మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన మాధవరపు వైష్ణవి షైన్ హై స్కూల్ నందు చదువుకుంటుంది. ఈమె తో పాటు ఈమె సోదరి కూడా షైన్ హై స్కూల్ నే చదువుకుంటుంది. యాజమాన్యం షరతులలో భాగంగా ఉపాధ్యాయులు నారాయణపురం వెళ్లి వైష్ణవి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి పాలసీని చేర్పించారు. ఉపాధ్యాయ. దీంతో వైష్ణవి తండ్రి తండ్రులు లక్ష రూపాయలు పాలసీ కట్టలేమని ప్రస్తుతం రూ. 50 వేల పాలసీ మాత్రం చేరతామని ఆ విధంగా వైష్ణవి పేరుతో 50 వేల రూపాయల పాలసీ చేర్పించారు.
దీంతో షైన్ స్కూల్ యాజమాన్యం రూ. 50 వేల రూపాయలకు 20 రూపాయల స్టాంపు పై కరస్పాండెంట్ షేక్ అన్సర్ పాషా భార్య షేక్ షరీఫర్ హద్ పేరుతో వైష్ణవి తల్లిదండ్రులకు 29 జనవరి 2026న రాసి ఇచ్చారు. ఈ పాలసీ ప్రకారం ప్రతినెల 50 వేల రూపాయలకు వచ్చే వడ్డీని విద్యార్థుల ఫీజులో జమ చేసుకుంటున్నారని విద్యార్థిని తండ్రి మాధవరపు వెంకటేశ్వరరావు తెలిపారు. పాలసీల బాగోతం బయటపడటంతో షైన్ స్కూల్ యాజమాన్యం అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటికి వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగా నారాయణపురం వైష్ణవి పేరుతో షైన్ హై స్కూల్ అగ్రిమెంట్ వెలుగులోకి వచ్చింది. దీంతో షైన్ స్కూల్ యాజమాన్యం ఏమి సమాధానం చెబుతుందో వేచి చూద్దాం.



