తెలంగాణపై బాబు ఫోకస్ రేవంత్‌కు సహకరించేందుకేనా !!
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాజకీయాల్లో సత్తా చాటాలని టీడీపీ తెలంగాణ శాఖ భావిస్తున్నది. ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారని ప్రచారంలో ఉంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నేతల మధ్య చర్చోపచర్చలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కూతురు, సినిమా నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని ఎన్నికల బరిలోకి దించాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ పార్టీలో సుహాసిని పేరు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక పార్టీ అధినేత గ్రీన్‌సిగల్ ఇవ్వడం లాంఛనమేనని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. సుహాసిని గతంలో కూకట్‌పల్లి నుంచి పోటీచేసినా, విజయం సాధించలేకపోయారు. ఈసారి మూడు పార్టీలు మద్దతిస్తే గెలుపు సులువవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంపై బీజేపీలో భిన్నాభిప్రా యాలు ఉన్నట్టు సమాచారం.
టీడీపీ పొత్తు వద్దని తెలంగాణ బీజేపీ నేత ఒకరు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు లేఖ రాసినట్టు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్‌కు చంద్రబాబు ఈ ఎన్నికల్లో పరోక్ష మద్దతిచ్చే అవకాశాలు ఉండటంతో తెలంగాణలో బీజేపీకి నష్టం చేస్తుదంటూ లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణ పార్టీ నాయకులు సైతం ఈ టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. అయితే చంద్రబాబు నిర్ణయం చేస్తే, దానికి కట్టుబడి ఉండే అవకాశాలు ఉన్నాయని టీడీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమీ పేర కాంగ్రెస్‌కు సహకరించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నవారూ లేకపోలేదు. చంద్రబాబు తెలంగాణ నేతలతో చర్చించనున్నారు. అనంతరమే బీజేపీ జాతీయ నాయకులతో మాట్లాడతారని సమాచారం. ఇక్కడ గెలవకున్నా, బీఆర్‌ఎస్ ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరిస్తారనే వ్యాఖ్యానాలు రాజకీయవర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES