మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో నీరా తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ఎక్సైజ్ శాఖ రాష్ట్ర మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన భువనగిరి మండలం నందనం గ్రామంలో తాటి నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి పరిశీలించి, మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన తాటి నీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రస్తుత రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి సందర్శించి వెంటనే ప్రారంభించాలని ఇక్కడ స్థానిక గౌడ కులస్తులకు ఈ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాలు కల్పించి ఈ తాటి నీరా ఉత్పత్తుల కేంద్రానికి బొమ్మగాని ధర్మం భిక్షం గౌడ్ పేరు పెట్టాలనీ జూన్ 2 వరకు ఈ కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కల్లుగీత కార్మిక పారిశ్రామిక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్, బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు జక్కా కవిత రాఘవేందర్ రెడ్డి, డాక్టర్ ర్యాకల శ్రీనివాస్, పడాల వెంకటేశ్వర్లు, కడమంచి ప్రభాకర్, జనగాం పాండు, ఏవి కిరణ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, పడమటి మమత, తుమ్మల వెంకట్ రెడ్డి, పలుసం రమేష్ గౌడ్, మట్ట ధనుంజయ గౌడ్, రాంపల్లి నాగేష్ గౌడ్, బత్తిని కుమార్ గౌడ్, బబ్బూరి పెద్ద నరసింహ గౌడ్, కూనూరు అంజయ్య గౌడ్, కాసుల రామనర్సయ్య గౌడ్, భువనగిరి లాలయ్య గౌడ్, అజీమ్, ఎలిమినేటి విట్టల్ రెడ్డి ,చింతల దేవేందర్ గౌడ్, పిన్నింటి మధుమోహన్ రెడ్డి ,జనగాం మహేష్, సిలువేరు మధు, సుర్వి సంపత్ గౌడ్, నీల భరత్ గౌడ్, ములుగు నాగరాజు మోడపు జీవన్ గౌడ్, మోత్కుపల్లి అజయ్ గౌడ కులస్తులు పాల్గొన్నారు.
నందనం తాటినీరా ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES