- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అత్యున్నత పురస్కారం లభించడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి తన తరఫున , పార్టీ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
- Advertisement -



