నవతెలంగాణం – కాటారం
కాటారం మండలంలోని రేగుల గూడెం గ్రామపంచాయతీ రైతు వేదికలో నానో యూరియా మరియు నానో డిఎపి ల పై జిల్లా వ్యవసాయ అధికారి బాబు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డిఎఓ మాట్లాడుతూ నానో యూరియ, డిఎపి వల్ల కలిగే ప్రయోజనాల గురించి పోషకాల లభ్యత, పోషకాలను పెంచడం ద్వారా నానోడిఏపీ పంట దిగుబడిని గణనీయంగా పెంచుతుందని,అవసరమైన పోషకాలను సమర్ధవంతంగా అందించడం వల్ల మెరుగైన మొక్కల పెరుగుదలకు, తోడ్పడుతుందాని నానో యూరియా నానో డి ఎ పి పంటలకు ఆరోగ్యకరమైన ఉత్పాదకతను పెంచుతుందని రైతులకు తెలిపారు.
అంతేకాకుండా నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల మొక్కలు మరింత సమర్థవంతంగా గ్రహించి,నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, నానో యూరియా వల్ల రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతయని, అలాగే నానో యూరియా వాడకం చాలా సులభం అవుతుదని జిల్లా వ్యవసాయ అధికారి బాబు రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ అధికారులు రేగులాగూడెం గ్రామపంచాయతీ లోని DCMS2, అరవిందకృప పెర్టిలైజర్ ఔట్లెట్స్ లాను సందర్శించి తనకి చేశారు. అనంతరం డీలర్లు అన్ని FCO -1985 నియమాలను పాటించాలని MRP కంటే ఎక్కువ ధరకు అమ్మకూడదని, ఎటువంటి లింకులు లేకుండా యూరియాను సరిగ్గా పంపిణీ చేయాలనీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ADA మహాదేవపూర్, MAO పూర్ణిమ కాటారం, AEO అష్మ, రైతులు పాల్గొన్నారు.
నానో యూరియా, నానో డిఏపి వలన రైతులకు అధిక ప్రయోజనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES