నవతెలంగాణ – జక్రాన్ పల్లి
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలోని వరి మరియు మక్కజొన్న పంటల్లో నానో యూరియా వినియోగం ద్వారా రైతులు అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. సంప్రదాయ యూరియాతో పోల్చితే, నానో యూరియా ద్వారానే మెరుగైన దిగుబడిని, ఆరోగ్యమైన పంటను, తక్కువ ఖర్చుతో సాధించడం జరగుతుందని మండల వ్యవసాయ అధికారి దేవిక తెలిపారు.
నానో యూరియా విశిష్టత
నానో-టెక్నాలజీ ఆధారంగా తక్కువ పరిమాణంలో ఎక్కువ నైట్రోజన్ మొక్కలకు అందుతుంది.
-ఒరిజినల్ యూరియాలో 46% నైట్రోజన్ ఉన్నా, మొక్కలకు చేరేది చాలా తక్కువ. నానో యూరియా వాడితే, ద్రవ రూపంలో ఇంకినప్పుడు 80% చెందుతుంది.
-20% నానో యూరియా ప్లస్ వినియోగం మాత్రమే సరిపోతుంది, అదే పరంగా సంప్రదాయ యూరియా 100% అవసరం ఉంటుంది. దీని వల్ల ఖర్చు మరియు వాడకం రెండూ తగ్గుతాయని వ్యవసాయ అధికారి తెలిపారు..
జక్రాన్ పల్లి మండలంలోని రైతుల అనుభవం:
కాటిపల్లి నర్సారెడ్డి మాజీ సర్పంచ్ నానో యూరియా గురించి మాట్లాడుతూ.. – వరి, మక్కజొన్న పొలాల్లో నానో యూరియా స్ప్రే చేసిన రైతులు, ఆకులు బలంగా, పొడి రంగులో, దళసరి ఎక్కువగా కనిపించిందని చెప్పారు.
– సక్రమమైన దశల్లో రెండు సార్లు ఫోలియర్ స్ప్రే చేయడం ద్వారా కేవలం, ఒక చిన్న నానో యూరియా లిక్విడ్ బాటిల్, ఒక పెద్ద యూరియా బ్యాగ్‌ను ప్రత్యామ్నాయంగా పని చేస్తుందని చెప్పారు.
– 20% నానో యూరియా ప్లస్ వేసిన తర్వాత, గింజ పరిణతి, గడ్డి బలం, సమృద్ధిగా గింజ నిండటం వంటి ఎఫెక్ట్‌లు స్పష్టంగా కనిపించాయి అంటున్నారు.
నానో యూరియా ముఖ్య ప్రయోజనాలు :
పర్యావరణ అనుకూలం: నేల, నీరు కాలుష్యం తగ్గుతూ, నైట్రోజన్ లీచింగ్, ఎమిషను తగ్గుతుంది.
– ఖర్చు తగ్గింపు: తక్కువ మోతాదు మెరుగైన ఫలితాల వల్ల ఎరిక వాడకం, రవాణా, నిల్వ ఖర్చు తగ్గుతుంది.
– దిగుబడి పెరుగుతుంది:భారీకటి లేకుండా, ఆకులు ఆరోగ్యంగా, పుష్పాలు బలంగా, గింజలు నిండుగా పెరుగుతాయి. కావున రైతులందరూ డ్రోన్ వినియోగించి తక్కువ పెట్టుబడి తో అద్భుత ఫలితాలు సాధించాలని మండల వ్యవసాయ అధికారిని దేవిక కోరారు.