- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ.. ట్రోఫీ ఇంకా మన దగ్గరికి చేరలేదు. దీనికి ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ వైఖరే కారణం. ఆసియా కప్‌లో భారత జట్టుకు ట్రోఫీ ప్రదానం చేయకపోవడం పట్ల బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. దీనిపై ఏసీసీ ఏజీఎంలో తన నిరసనను తెలియజేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి నఖ్వీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అయితే.. ట్రోఫీని, మెడల్స్‌ను అందించకూడదని ఆయన మొండిగా ఉన్నట్లు తెలుస్తోంది.
- Advertisement -