పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ వెల్లడి
నవతెలంగాణ- భువనగిరి
కొంత కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. క్రమశిక్షణను ఉల్లంఘించిన ఆలేరు మండల నాయకులు మంగ నర్సింహులు, బబ్బురి పోశెట్టిని సీపీఐ(ఎం) నుంచి బహిష్కరిస్తునట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జిల్లా కార్యదర్శివర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) నుంచి బహిష్కరణకు గురైన నరసింహులు, పోశెట్టికి ఇకపై పార్టీతో ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. ప్రతి సభ్యుడూ పార్టీ నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు. పార్టీ నియమాలను ఎవరు అతిక్రమించినా క్రమశిక్షణా చర్యకు గురవుతారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు ఉన్నారు.
సీపీఐ(ఎం) నుంచి నరసింహులు, పోశెట్టి బహిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



