Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంఎప్‌సెట్‌లో నారాయణ విద్యా సంస్థల హవా

ఎప్‌సెట్‌లో నారాయణ విద్యా సంస్థల హవా

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు చరిత్రను తిరగరాసారని డైరెక్టర్లు డాక్టర్‌ పీ సిందూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు. ఈ ఫలితాల్లో అనేక సంచాలనాలను నమోదు చేశారని ఆదివారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఇంజినీరింగ్‌, అగ్రి అండ్‌ ఫార్మసీ విభాగాల్లో రెండు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకుల్ని తమ విద్యార్థులు సాధించారని తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో తమ విద్యార్థి భరత్‌చంద్ర, అగ్రి అండ్‌ ఫార్మసీ విభాగంలో పీ సాకేత్‌రెడ్డి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకులు సాధించారని వివరించారు. ఇంజినీరింగ్‌లో వందలో 39 ర్యాంకులు, అగ్రి అండ్‌ ఫార్మసీలో వందలో 15 ర్యాంకుల్ని నారాయణ విద్యాసంస్థల విద్యార్థులే సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మొత్తంగా పదిలోపు ఐదు ర్యాంకులు, వందలోపు 54 ర్యాంకులు, 500 లోపు 265 ర్యాంకులు, వెయ్యిలోపు 492 ర్యాంకుల్ని తమ విద్యార్థులు సాధించారని వివరించారు. నారాయణ విశిష్ట విద్యాప్రణాళిక ద్వారానే ఈ ఘనవిజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులకు అభినందనలు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -