Friday, June 20, 2025
E-PAPER
Homeజిల్లాలునారాయణ పాఠశాలను వెంటనే మూసివేయాలి

నారాయణ పాఠశాలను వెంటనే మూసివేయాలి

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నారాయణ పాఠశాలను మూసివేయాలని విద్యార్థి సంఘాల  ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాల ముందు ఆందోళన చేసి ప్లెక్సీనీ  నాయకులు చించివేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ లు మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యా సంస్థ అయినటువంటి నారాయణ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ వేలాది రూపాయలు దోచుకుంటున్నారన్నారు. అడ్మిషన్ పేరుతో పుస్తకాల పేరుతో విద్యను వ్యాపారం చేస్తున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన అనుమతులను తప్పుదో పట్టిస్తూ విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ పాఠశాలలను నడుపుతున్నారన్నారు. పూర్తిగా అనుమతి రాకముందే తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మాయ మాటలు చెప్పి అడ్మిషన్ చేస్తున్నారన్నారు. కావున తల్లిదండ్రులు ఆలోచించాలని పాఠశాలకు పూర్తిగా అనుమతి రాకముందే తమ పిల్లలను చేర్పించొద్దని కోరుతున్నాం అన్నారు. అనుమతులు లేకుండా నడుపుతున్న నారాయణ పాఠశాలను వెంటనే మూసివేసి యజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.  లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బులెట్, భారత్, రాహుల్, శ్యామ్, మణికంఠ, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -