Tuesday, March 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనారాయణ స్కూల్‌ విద్యార్థి క్షివ్‌ చకావే అరుదైన రికార్డ్‌

నారాయణ స్కూల్‌ విద్యార్థి క్షివ్‌ చకావే అరుదైన రికార్డ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నారాయణ స్కూల్స్‌కు చెందిన చెస్‌ ప్రతిభావంతుడు క్షివ్‌ చకావే అసాధారణ విజయాన్ని నమోదు చేశాడు. ఫీడే, ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక ‘ఎల్‌బీహెచ్‌ఎం ఆల్‌ ఇండియా ఓపెన్‌ ఫీడే రేటెడ్‌ చెస్‌ టోర్నమెంట్‌’లో తన అత్యుత్తమ ప్రదర్శనతో క్షివ్‌ చకావే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును సాధించాడు. అతి చిన్న వయస్సులోనే అసాధారణమైన ప్రతిభను, వ్యూహాత్మక చతురతను ప్రదర్శించాడు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌ అండర్‌-6 విభాగంలో 3వ ర్యాంక్‌ సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకుంటూ క్షివ్‌ 1560 ఫీడే రేటింగ్‌ను సాధించాడు.

తద్వారా అండర్‌-6 విభాగంలో ప్రపంచంలోని టాప్‌ 10 క్రీడాకారుల్లో ఒకరిగా నిలవడమే కాకుండా, దేశంలో మూడో ర్యాంక్‌, మహారాష్ట్రలో తన వయస్సు విభాగంలో నెంబర్‌.1 ర్యాంక్‌ క్రీడాకారుడిగా స్థానం దక్కించుకున్నాడు. క్షివ్‌ సాధించిన ఈ విజయం చదరంగం పట్ల అతని అంకితభావానికి, విశ్లేషణాత్మక సామర్థ్యానికి, నిలకడైన ప్రదర్శనకు నిదర్శనంగా నిలుస్తోంది. క్షివ్‌ తన చదువుతో పాటు పోటీ పరీక్షల సన్నద్ధతను, టోర్నమెంట్‌ సమయాలను సమతుల్యం చేసుకునేలా నారాయణ స్కూల్‌ అదనపు అకడమిక్‌ మద్దతును అందిస్తోంది. నిరంతర మార్గదర్శకత్వం, అకడమిక్‌ సౌలభ్యం ద్వారా విద్యార్థులు చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా రాణించేలా నారాయణ స్కూల్స్‌ నిరంతరం ప్రోత్సహిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -