వరుసగా మూడోసారి అత్యుత్తమ మార్కులు
నారాయణ విద్యాసంస్థ డైరెక్టర్స్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ఇంటర్ 2026 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 469, 469 మార్కులతో రెండు స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించి విజయదుందుభి మోగించారు. అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 996 మార్కులను ఐదుగురు నారాయణ విద్యార్థులు సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్ బై.పీ.సీ. విభాగంలో 440 మార్కులను గాను 438 మార్కులను ఇద్దరు విద్యార్థులు సాధించారు. సీనియర్ ఇంటర్ వై.పీ.సీ విభాగంలోనూ 1000 మార్కులకు గాను 994 మార్కులను ముగ్గురు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఇక ఫలితాలను గ్రూపుల వారీగా విశ్లేషిస్తే జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఇంటర్ బోర్టు చరిత్రలోనే అత్యధికంగా 470 మార్కులకు గాను 469 మార్కులతో నారాయణ విద్యార్థులు కె. సాయిగౌతమ్ (హెచ్.టి.నెం: 2643109430), జి. వరేణ్య (హెచ్.టి.నెం: 2645105059) చరిత్ర సృష్టించారు, 468 మార్కులు 16 మంది, 467 మార్కులు 19 మంది, 466 మార్కులు 40 మంది, 465 మార్కులు 28 మంది విద్యార్థులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 996 వంటి అత్యుత్తమ మార్కులను ఐదుగురు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అలాగే 995 మార్కులను 10 మంది, 994 మార్కులను 29 మంది, 993 మార్కులను 71 మంది, 992 మార్కులను 121 మంది సాధించారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ బై.పీ.సీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులను మొత్తం ఇద్దరు విద్యార్థులు కైవసం చేసుకోగా, 437 మార్కులను ముగ్గురు, 436 మార్కులను ఐదుగురు, 435 మార్కులను ఆరుగురు నారాయణ విద్యార్థులు సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 994 మార్కులు ముగ్గురు సాధించగా, 993 మార్కులు ముగ్గురు, 992 మార్కులు 11 మంది, 991 మార్కులు 11 మంది, 990 మార్కులు ఏడుగురు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పి. సింధూర నారాయణ, శరణి నారాయణ, రమా నారాయణ తెలిపారు. ఈ స్థాయి ఫలితాలు నారాయణ తప్ప మరి ఏ ఇతర సంస్థ సాధించలేదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమా నారాయణ మాట్లాడుతూ జూనియర్ ఇంటర్ ఆల్‌టైమ్ హయ్యస్ట్ మార్కులు వరుసగా మూడవసారి నారాయణ సాధించటం ఎంతో గర్వకారణంగా అన్నారు. ఆరంభం నుంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం పటిష్టమైన మైక్రోషెడ్యూల్స్ రూపొందించి కాన్సెప్యువల్ ఓరియంటేషన్‌లో విద్యాబోధన చేయటం వల్లనే తమ విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలను సాధించగలిగారని తెలిపారు. అలాగే శరణి నారాయణ మాట్లాడుతూ తెలంగాణలోని నారాయణ విద్యాసంస్థల్లో జూనియర్, సీనియర్ ఇంటర్‌లో అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించటం జరిగిందని చెప్పారు. సబ్జెక్టుల వారీగా విశ్లేషణాత్మక ధోరణిలో విద్యార్థుల మేధోసంపత్తిని పెంపొందించే విధంగా పాఠ్యాంశాల బోధన చేయటం అనేది నారాయణ ప్రత్యేకతగా చెప్పారు. అలాగే డా||పి. సింధూర నారాయణ మాట్లాడుతూ గత 47 సంవత్సరాల నారాయణ అప్రతిహత విజయప్రస్థానానికి కొనసాగింపుగా, నేటి ఇంటర్ ఫలితాలే నిదర్శనమన్నారు. నేటి ఈ ఫలితాలే రేపటి జేఈఈ అడ్వాన్స్డ్ మరియు నీట్ ఫలితాలకు సోపానమన్నారు. ప్రవేశ పరీక్షలన్నింటిలోనూ తమ విద్యార్థులే అత్యద్భుత ర్యాంకులు సాధిస్తా రని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటి ఘనవి జయాన్ని సాధించిన తమ విద్యార్థులకు, తల్లిదం డ్రులకు, అధ్యాపకబందానికి నారాయణ విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేశారు.
నారాయణ ఆల్‌టైమ్ రికార్డ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



