Tuesday, October 7, 2025
E-PAPER
Homeబీజినెస్ఈ నెల 10 నుంచి నారెడ్కో ప్రాపర్టీ షో

ఈ నెల 10 నుంచి నారెడ్కో ప్రాపర్టీ షో

- Advertisement -

– హైటెక్స్‌లో ఏర్పాటు
నవతెలంగాణ – హైదరాబాద్‌

రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల ఆసోసియేషన్‌ నారెడ్కో ఈ నెలలో మూడు రోజుల పాటు ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తోన్నట్టు తెలిపింది. అక్టోబర్‌ 10 నుంచి 12 వరకు నగరంలో హైటెక్స్‌లో 15వ ఎడిషన్‌ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఉంటుందని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయ సాయి మేకా తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది వివిధ రకాల కొనుగోలుదారుల అవసరాలను తీర్చడానికి నివాస, కార్యాలయ వాణిజ్య, రిటైల్‌ వాణిజ్యంతో సహా ఆస్తులను ఇక్కడ తమ భాగస్వాములు ప్రదర్శించనున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల విధానాలు, స్థిరమైన సంస్కరణల కారణంగా నగరం ఐటీ, ఐటీఈఎస్‌, ఫార్మా, ఏరోస్పేస్‌, ఏవియేషన్‌, ఆటో మొబైల్స్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో స్థిరమైన జోరును చూస్తోందన్నారు. కొనుగోలుదారుల మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా పరిష్కారాలను అందించాలనే ఉద్ధేశ్యంతో ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తోన్నామన్నారు. నరెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్‌ కె శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ”15వ ఎడిషన్‌ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో గృహ కొనుగోలుదారుల విభిన్న అవసరాలను తీర్చే విస్తృత శ్రేణి ఆస్తులను ఒకచోట చేరుస్తుంది. పండుగ సీజన్‌ సమీపిస్తున్నందున కాబోయే కొనుగోలుదారులు తమ కలల ఆస్తిని అన్వేషించడానికి, ప్లాన్‌ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -