Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కల్లెడలో నారి స్వశక్తి పరివార్ కార్యక్రమం

కల్లెడలో నారి స్వశక్తి పరివార్ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
ఆలూరు మండలంలోని కల్లెడ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైద్యాధికారి ప్రకాష్ కుమార్ బుదవారం తెలియచేశారు. ఈ కార్యక్రమంలో 91 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గైనిక్ సమస్యలు, చర్మ సంబంధ సమస్యలు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, కంటి సమస్యలు పరిక్షించి తగిన సలహాలు సూచనలు, మందులు అందజేశారు. 33 మంది మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజశ్రీ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి ప్రవీణ్ రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్ పద్మ, ఫార్మసీ ఆఫీసర్ నారాయణ, సూపర్ వైజర్ లు ప్రభాకర్, సుమతీ, ల్యాబ్ టెక్నీషియన్ భాగ్య లక్ష్మి, సిబ్బంది, ఆశా లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -