– మంత్రి తుమ్మల సహకారంతో పేట లోనూ మరో పరిశ్రమకు రూపకల్పన
– ఆయిల్ ఫెడ్ అప్పు చేసినా,అభివృద్ది చేసినా రైతులు సంక్షేమమే లక్ష్యం
– ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
సిద్దిపేట – నర్మెట్టలో నిర్మించిన పామాయిల్ పరిశ్రమను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించనున్నామని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రకటించారు. ఆయన ఆదివారం అశ్వారావుపేట,అప్పారావుపేట పరిశ్రమలను సందర్శించిన అనంతరం ఆయిల్ ఫేడ్ అశ్వారావుపేట పరిశ్రమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
విస్తరించిన సాగు, పెరుగుతున్న గెలలు దిగుబడికి అనుగుణంగా పరిశ్రమలను నిర్మిస్తున్నామని తెలిపారు.నర్మెట్ట పరిశ్రమ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, కల్లూరి గూడెం పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభం సివిల్ వర్క్ పూర్తి కావచ్చింది అని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహాకారంతో అశ్వారావుపేట లో మరో పరిశ్రమ నిర్మాణానికి రూపకల్పన చేస్తామని తెలిపారు.
తక్కువమంది సిబ్బందితో ఎక్కువ పని చేయిస్తున్నామని,రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గెలలు తీసుకుంటామని అన్నారు. హాఫ్ టైప్ మొక్కలు పై ప్రశ్నించగా కాత లేని చెట్లు అన్నీ హాఫ్ టైప్ కాదని,చెట్టు ఏదైనా కాత రాకపోవడానికి పెంపుదల లో వైఫల్యం,వాతావరణం,నేల స్వభావం కారణాలు అవుతాయని,అయినప్పటికీ కొన్ని పొరపాట్లు ను సరిదిద్దుతున్నామని అన్నారు.కాయని మొక్కలు రైతులు బాధలు అర్ధం చేసుకుంటన్నాం అని అన్నారు.
అప్పు చేసినా అభివృద్ది చేసినా రైతులు సంక్షేమం మే ముఖ్యంగా ఆలోచిస్తున్నాను అన్నారు.అయితే కొందరు ప్రచారం చేసేవిధంగా ఆయిల్ ఫెడ్ కు అంత అప్పు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ లు సుధాకర్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి,ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీవో లు సబావత్ శంకర్,నాయుడు రాధా క్రిష్ణ,అశ్వారావుపేట,అప్పారావుపేట పరిశ్రమ మేనేజర్ లు నాగబాబు,కళ్యాణ్ గౌడ్,బండి భాస్కర్ లు పాల్గొన్నారు.