- Advertisement -
వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు నర్రా రమేష్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్న వయస్సులో అనారోగ్యంతో మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. తాను ఖమ్మం జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఖమ్మం నగరంలో ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమాల్లో అత్యంత క్రియాశీలకంగా రమేష్ పని చేశాడని గుర్తు చేశారు. చిన్ననాటి నుండి విద్యార్ధి, ప్రజా ఉద్యమాల్లో కలిసి పని చేశామని తెలిపారు. రమేష్ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- Advertisement -