– సర్పంచ్ శైలజశ్రీశైలం.
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామపంచాయతీ స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్థానిక సర్పంచ్ పులిమామిడి శైలజశ్రీశైలం అన్నారు. ఆదివారం మండలంలోని నర్సంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శైలజా శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నర్సంపల్లి నుండి ఊరుకొండ పేట పోయే రోడ్డుకు, నర్సంపల్లి గేటు నుండి గ్రామానికి వచ్చే రోడ్డుకు మొరం కొట్టించి.. రోడ్లు ప్రజా అవసరాలకు బాగు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి, పైల్ల గోపాల్, శేఖర్ రెడ్డి, రఘుమారెడ్డి, శంకర్, మహేష్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



