Saturday, November 15, 2025
E-PAPER
Homeబీజినెస్నాట్కో ఫార్మాకు రూ.518 కోట్ల లాభాలు

నాట్కో ఫార్మాకు రూ.518 కోట్ల లాభాలు

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో నాట్కో ఫార్మా లిమిటెడ్‌ నికర లాభాలు 23.44 శాతం తగ్గి రూ.517.9 కోట్లుగా నమోదయ్యాయి. పరిశోధన, అభివృద్ధి (అర్‌అండ్‌డీ)పై వ్యయాలు పెరగడం, ఉద్యోగుల బోనస్‌లు వల్ల లాభాల్లో తగ్గుదల చోటు చేసుకుందని నాట్కో వెల్లడించింది. ఆ ఔషధ ఉత్పత్తుల కంపెనీ 2024-25 ఇదే సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.676.5 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.1,371.1 కోట్ల రెవెన్యూ ఉండగా.. గడిచిన క్యూ2లో రూ.1,363 కోట్లుగా చోటు చేసుకుంది. మొత్తం వ్యయాలు రూ.849.3 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో రూ.616.7 కోట్ల వ్యయాలు నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను రెండో సారి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.1.50 చెల్లించడానికి నాట్కో బోర్డు ఆమోదం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -