- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులు జక్రాన్ పల్లి ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ కె సుధారాణికి ఉత్తమ సేవకు గాను నేషన్ బిల్డర్ అవార్డుతో ఘనంగా సన్మానించడం జరిగింది. విద్యార్థి జీవితంలో గురువుల పాత్ర ఏన లేనిదని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి పి.గోపాల్ రెడ్డి అడ్వకేట్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాం అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జావర్, నజీర్, సుకన్య, గ్రీష్మ, ఇఫ్రా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -