నవతెలంగాణ-సదాశివపేట
సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నాడు ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి.మురళీకృష్ణ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్షేత్రస్థాయిలో పంటల సాగు, రైతుల జీవన విధానం, వ్యవసాయ రంగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పంటల పెంపకం, సంరక్షణ, ఉత్పత్తి ప్రక్రియలపై విస్తృతంగా వివరించారు. వ్యవసాయం దేశానికి వెన్నుముక అని పేర్కొంటూ, యువత వ్యవసాయ రంగంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి మాట్లాడుతూ.. వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ వ్యవసాయ దినోత్సవాన్ని విజయవంతం చేశారు.



