- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
జాతీయ అవార్డుకు ఎంపికైన పుట్ల నాగేశ్వర్ రావ్ ను శనివారం స్థానిక మండల వనరుల కేంద్రంలో ఎంఇఓ రామవత్ మాంగ్య నాయక్ సన్మానించారు. జాతీయ అవార్డు స్వీకరించిన నాగేశ్వర్ రావు పత్రిక రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారని చెప్పారు.ఆయన ఫొటో గ్రాపర్ గా విశేష సేవలు చేశారని ఆయన సేవలకు అభించిన గుర్తింపుగా అభివర్ణించారు. కార్యక్రమంలో దశరథ్ నాయక్,మురళీ యాదవ్,రాంబాబు,కోటి, మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



