ప్రజా సేవకుడు వట్టపల్లి అనిల్ రెడ్డి
జాతీయ రంగుల పుస్తక దినోత్సవం సందర్భంగా పండ్లు, బిస్కెట్లు పంపిణీ
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తక్కెళ్ళగూడెం గొత్తి కోయగూడెంలో ప్రజా సేవకుడు వట్టపల్లి అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులతో కలిసి శనివారం తక్కెళ్ళగూడెంలోని గిరిజన ప్రజలకు, చిన్నారులకు అరటి, ఆపిల్ పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆగస్టు 2వ తేదీన జరుపుకునే జాతీయ రంగుల పుస్తక దినోత్సవాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదాన్ని కల్పించే రంగుల చిత్రాలను ముద్రించి పుస్తకాన్ని 2015లో ఆవిష్కరించారని అన్నారు.
మనుషులకు రంగుల వేసుకునే రోజు నుండి చిన్నారులకు రంగుల పుస్తకాలను అందించే వరకు చేరుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 1880 సంవత్సరంలో ప్రపంచంలో రంగుల పుస్తకం వచ్చినప్పటికీ మారుమూల ప్రాంతాలకు కూడా రంగుల పుస్తకం చేరుకోవడానికి చాలాకాలం పట్టిందన్నారు. రంగుల పుస్తకం తో విజ్ఞానం, విద్యా కాకుండా శస్త్ర చికిత్స సహాయాలు, రాజకీయ ప్రకటనలు, పత్రిక ప్రచారాలు వివిధ ప్రయోజనాల కోసం రంగులను ఉపయోగిస్తున్నారని అన్నారు.
గిరిజన విద్యార్థులు విద్యావిజ్ఞానంలో ప్రభావితులు కావాలని ప్రతిభ చూపాలని ప్రేరేపించడం, అవగాహన చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు గౌడ సంఘం నాయకుడు నిమ్మల బాలరాజు, నాయకపోడు సేవా సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు గుండ్ల రాజు, యువకులు ఎనగంటి సంజయ్, రణధీర్, వడ్డెర సంఘం నాయకుడు కంది రాంబాబు గూడెం పెద్దలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
గుత్తి కోయగూడెంలో ఘనంగా జాతీయ రంగుల పుస్తక దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES