- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
జాతీయ రైతు దినోత్సవంని పునస్కరించుకొని గాంధారి గ్రామంలోని 11వ వార్డులో కుమ్మరి శంకర్ అనే రైతుని వార్డు సభ్యులు సిందే నితిన్ పాటిల్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్బంగా నితిన్ పాటిల్ మాట్లాడుతూ.. భారతదేశానికి రైతులు వెన్నుముక లాంటివారన్నారు. కావున ఎద్దు ఏడ్చినా.. వ్యవసాయం బాగుపడదు.. రైతు బాధపడ్డ రాజ్యం బాగుపడదు అని అన్నారు. కాబట్టి రైతులకు అందరూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి రైతులకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ పటేల్, మనోజ్, అమీర్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



