నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 79 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎంఏ అధ్యక్షులు డా. అజ్జ శ్రీనివాస్ ఐఎంఏ బిల్డింగ్ ప్రాంగణం లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్బంగా డా. అజ్జ శ్రీనివాస్ కార్యదర్శి డా. విక్రం రెడ్డి నిజామాబాదు జిల్లా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేసీ, మనకు ఎందరో అమర వీరుల త్యాగ పలితంగా స్వతంత్రం సాదించుకున్నామని, దేశ అభివృద్దికి అందరు పాటుపడాలని, ఐఎంఏ సభ్యులందరు గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతం ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా. అజ్జ శ్రీనివాస్, కార్యదర్శి డా. విక్రం రెడ్డి,ఉపాధ్యక్షులు డా. శ్రీధర్ రావు, డా. హరీష్ స్వామీ, కొశాదికారి డా. రాజేందర్ సూరినీడు, సీనియర్ వైద్యులు డా. శ్రీహరి, డా. సురేందర్ రెడ్డి, డా లక్ష్మి నారాయణ, డా. వినోద్ కుమార్ గుప్తా, డా. సుభాష్, డా. ప్రభాకర్, డా.శ్యాంసుందర్, డా. చైతన్య డా. రవి తేజ, డా. రషీద్ అలీ, డా. శివ ప్రసాద్ , ప్రదీప్ కుమార్ గట్టాని, తదితరులు పాల్గొన్నారు.
ఐఎంఏ బిల్డింగ్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES