Tuesday, January 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతలకిందులుగా జాతీయ జెండావిష్కరణ

తలకిందులుగా జాతీయ జెండావిష్కరణ

- Advertisement -

– గమనించి.. సరి చేసి ఆవిష్కరించిన ఎమ్మెల్యే
– సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఘటన
నవతెలంగాణ-దుబ్బాక

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలో.. తలకిందులుగా ఉండటంతో గమనించిన ఎమ్మెల్యే.. ఆ వెంటనే సరిచేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో దుబ్బాకకు ఎన్నో నిధులు తెచ్చి అభివృద్ధి చేశామన్నారు. కానీ రెండేండ్ల కాంగ్రెస్‌ పాలనలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనకపట్టు పట్టిందని విమర్శించారు. దాంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే తీరును తప్పు పడుతూ వాగ్వాదానికి దిగారు. తమ సర్కార్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే కారును అడ్డగించారు. ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దుబ్బాక ఎస్‌ఐ కీర్తి రాజు, పోలీసు సిబ్బంది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులకు నచ్చజెప్పి ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా జాతీయ జెండాను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ మున్సిపల్‌ అధ్యక్షులు నర్మేట ఏసురెడ్డి ఆధ్వర్యంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -