డిప్యూటీ రేంజ్ అధికారి హెచ్. సురేందర్
నవతెలంగాణ – కాటారం
జాతీయ అరణ్య అమరవీరుల దినోత్సవం సందర్బంగా అరణ్య సంరక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుల సేవను గుర్తు చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అటవి క్షేత్రాధికారి కార్యాలయం పరిధిలోని కాటారం, పెగడపల్లి రేంజ్ అటవీ సిబ్బందితో కలిసి అటవి అరణ్య అమరవీరుల కు రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం ఎఫ్ ఆర్ఓ కార్యాలయం నుండి చింతకాని ఎక్స్ రోడ్డు వరకు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ రేంజ్ అధికారులు సురేందర్, శ్రీనివాస్, లియాక్ హుస్సేన్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు అర్చన, చంద్రశేఖర్, లక్ష్మణ్ రావు, హుస్సేన్ ఖాన్, ఫయాజ్, సంతోష్, బీట్ అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ అరణ్య అమరవీరుల దినోత్సవం
- Advertisement -
- Advertisement -