Thursday, November 20, 2025
E-PAPER
Homeజాతీయంఛత్తీసగఢ్‌లో జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌..

ఛత్తీసగఢ్‌లో జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఛత్తీసగఢ్‌కి చేరుకున్నారు. ఆమె వచ్చిన ప్రత్యేక విమానం ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లో టేకాఫ్‌ అయింది. ఆ రాష్ట్ర గవర్నర్‌ రామెన్‌ దేకా, ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి రాష్ట్రప‌తికి స్వాగతం పలికారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కేంద్రం జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌ కార్యాక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేడు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జరగనున్న జన్‌జాతీయ గౌరవ్‌ దివాస్‌ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.

కాగా, నవంబర్‌ 21న రాష్ట్రపతి తెలంగాణ, నవంబర్‌ 22న ఏపీ రాష్ట్రాలను సందర్శించనున్నారు. నవంబర్‌ 21వ తేదీన సికింద్రాబాద్‌లోని బోలారంలోని రాష్ట్రపతి నిలయంలో రెండవ ఎడిషన్‌ భారతీయ కళా మహోత్సవ్‌ 2025ను ప్రారంభించనున్నారు. నవంబర్‌ 22న ఏపీలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -