హైదరాబాద్ : నాలుగు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన హెచ్‌ఎఫ్‌ఐ 17వ జాతీయ మినీ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్స్ పోటీలు సోమవారం ముగిశాయి. అండర్-12 బాలురు, బాలికల విభాగంలో 22 రాష్ట్రాలు పోటీపడగా.. బాలికల విభాగంలో తెలంగాణ చాంపియన్‌గా నిలిచింది. బాలుర విభాగంలో తెలంగాణ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సోమవారం నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్స్‌లో తొలుత హర్యానాపై 15-10తో తెలంగాణ గర్ల్స్ టీమ్ మెరుపు విజయం సాధించింది. బాలుర విభాగం ఫైనల్లో ఆతిథ్య జట్టుపై ఢిల్లీ పైచేయి సాధించింది. ఆఖరు వరకు ఉత్కంఠరేపిన టైటిల్ పోరులో 23-24తో తెలంగాణ పోరాడి ఓడింది. తెలంగాణ హ్యండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు మల్‌రెడ్డి రాంరెడ్డి, హెచ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌లు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
జాతీయ హ్యాండ్‌బాల్ చాంప్ తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES