బ్రోచర్ ఆవిష్కరించిన క్రీడామంత్రి వాకిటి శ్రీహరి
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రతిష్టాత్మక జాతీయ సీనియర్ మహిళల చాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 27 నుంచి 30 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 30 రాష్ట్రాల జట్లు జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. 2018 తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ కబడ్డీ పోటీల బ్రోచర్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక చేసే భారత జట్టుకు ఈ టోర్నమెంట్ సెలక్షన్ ట్రయల్‌గా ఉండనుందని తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని వీరేష్ తెలిపారు. శాట్జ్ చైర్మెన్ శివసేనా రెడ్డి, తెలంగాణ కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి, భారత కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ క్రీడాకారుడు మల్లేశ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.



