వ్యవసాయ, మత్స్య రంగాల్లో రెండు అవార్డులు
కలెక్టర్‌కు ఉత్తమ వ్యవసాయ విధానాల అమలుకు అవార్డు
మత్స్య సంపద అభివద్ధిలో మత్స్య శాఖకు పురస్కారం
సాంకేతికతతో కూడిన ఆధునిక వ్యవసాయ విధానాల ప్రచారం
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా వ్యవసాయ, మత్స్య రంగాల అభివద్ధిలో కీలక ముందడుగు వేసింది. ఇటీవల జాతీయ స్థాయిలో జరిగిన ఒక ప్రతిష్టాత్మక సదస్సులో జిల్లా చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గాను రెండు జాతీయస్థాయి అవార్డులు లభించాయి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి సుస్థిర వ్యవసాయ విధానాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఒక అవార్డు, మత్స్య సంపద అభివద్ధిలో విశేష కషికి గాను జిల్లా మత్స్య శాఖకు మరొక అవార్డు దక్కాయి. దేశవ్యాప్తంగా ఈ అవార్డుకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఎంపిక కావడం విశేషం.జాతీయ సదస్సులో అవార్డుల ప్రదానం’ఇండో అగ్రి’, ‘సస్టయినబిలిటీ మ్యాటర్స్’ సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన ‘సస్లయినబుల్ అగ్రికల్చర్ సమ్మిట్’లో ఈ నెల 7వ తేదీన ఈ అవార్డులను ప్రదానం చేశారు.
జిల్లా కలెక్టర్ తరపున జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ నీలం వెంకటేశ్వర్ రావు, మత్స్య శాఖ అధికారి డాక్టర్ విజయభారతి ఈ పురస్కారాలను అందుకున్నారు. పంజాబ్ ఫిరోజ్ పూర్ కలెక్టర్‌తో పాటు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఈ అవార్డుకు ఎంపికయ్యారు.వ్యవసాయ రంగంలో విజయవంతమైన ప్రయోగాలుజిల్లాలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి, రైతులకు మేలు చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. వీటిలో కొన్ని పరిశీలిస్తే… ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు 29130 ఎకరాల్లో పచ్చిరొట్ట సాగును ప్రోత్సహించారు. దీనివల్ల సుమారు 1310 టన్నుల యూరియా ఆదా అయింది. నేరుగా వరి విత్తే పద్ధతిని 67500 ఎకరాల్లో అమలు చేయడం ద్వారా కూలీల కొరతను అధిగమించడంతో పాటు, రైతులకు రెండున్నర ఎకరాలకు రూ.10వేలు ఆదా అయింది. భూమిలో సహజంగా భాస్వరం లభించేందుకు జీవన ఎరువుల వాడకాన్ని 31600 ఎకరాల్లో అమలు చేశారు.
అధిక దిగుబడినిచ్చే నూతన వరి వంగడాలను రైతులకు పరిచయం చేసి, ప్రచారం చేశారు. ‘ఈ సాయం’ వాట్సాప్ గ్రూప్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయ సమాచారం, సూచనలు అందిస్తున్నారు.మత్స్య సంపద, మత్స్యకారుల అభివద్ధిమత్స్య రంగాభివద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి కూడా జిల్లాలో అనేక చర్యలు చేపట్టారు. వాటిలో కొన్ని పరిశీలిస్తే… జిల్లాలోని చెరువులు, కుంటలు, జలాశయాలలో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఇతర జిల్లాల్లోని ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు ఇక్కడ నుంచి సీడ్స్ ఎగుమతి చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు చేప పిల్లల పెంపకంపై అవగాహన కల్పించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపల కొలనుల ఏర్పాటుకు సహాయం అందిస్తున్నారు.
కరీంనగర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES