రాజీ మార్గమే – రాజ మార్గం
నవతెలంగాణ – కంఠేశ్వర్
చాలా మంది ప్రజల న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన , పరిష్కరించడానికి భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరచుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. తేది:28-3-2026 నాడు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇందులో చిన్న చిన్న కేసులు , ట్రాఫిక్ చలానాలు , మైనర్ క్రిమినల్ కేసులు , సివిల్ డిస్ప్యూట్లు వంటి వివాదాలు లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను తక్కువ సమయంలో ముగించుకోవచ్చన్నారు. అంతేకాకుండా, ఇది ఒక శాంతియుత పరిష్కార విధానం కాబట్టి , పక్షాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.కోర్టు లో గల కేసులలో త్వరగా పరిష్కారం చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విజ్ఞప్తి చేశారు.



