సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి కిరణ్
నవతెలంగాణ -పెద్దవంగర
రేపు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై క్రాంతి కిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీ మార్గం రాజమార్గమని, కక్షలు, విద్వేషాలతో ఏమీ సాధించలేరన్నారు. రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో వైవాహిక కుటుంబ తగాదాలు, గృహహింస కేసులు, రోడ్డు ప్రమాద క్లెయిమ్స్, చెక్ బౌన్స్ దావాలు, వాణిజ్య వివాదాలు, ఆస్తి, ఉద్యోగ సంబంధమైన తగాదాలు, రుణ వసూళ్లు, భూమి,ఇల్లు పంపకాలు, భూసేకరణ, భూ ఆక్రమణ, ఇల్లు ఆక్రమణ వంటి పెండింగ్లో ఉన్న ఏ ఇతర సివిల్ కేసులైన పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీ మార్గం రాజ మార్గమని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES