– మంత్రి పొన్నంతో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి భేటి
– సదస్సు నిర్వహణపై ఎలేట్స్ టెక్నో ప్రతినిధులతో చర్చ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
నేషనల్ మెబిలిటి సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కమిషనర్ ఇలంబర్తి, జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్ , ఎలేట్స్ టెక్నో ప్రతినిధులు శుక్రవారం భేటి అయ్యారు. రెండో నేషనల్ మొబిలిటీ సమ్మిట్ 2026 భారతదేశంలో రవాణా రంగం, స్మార్ట్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, నగర రవాణా అభివద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు మొబిలిటీ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఎలేట్స్ టెక్నోమీడియా నిర్వహిస్తున్న కార్యక్రమంలో తెలంగాణ రవాణా శాఖ ముఖ్య భాగస్వామిగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న నేషనల్ మొబిలిటీ సమ్మిట్ 2026 దేశంలో సస్టెయినబుల్, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ అభివద్ధికి ముఖ్యమైన వేదికగా నిలవనుంది. ఈ సమ్మిట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్, కార్బన్ ఉద్గారాల తగ్గింపుపై విస్తృత చర్చలు జరగనున్నాయి. స్మార్ట్ మొబిలిటీ టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, డిజిటల్ టికెటింగ్, డేటా ఆధారిత ఫ్లీట్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా పంచుకోనున్నారు. మెట్రో, బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర రవాణా విధానాలను కలిపే మల్టీ-మోడల్ కనెక్టివిటీ అవసరాన్ని సమ్మిట్ లో ప్రధానంగా చర్చించబోతున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్‌ల మధ్య సహకారంతో భవిష్యత్ మొబిలిటీకి కొత్త అవకాశాలు సష్టించాల్సిన అవసరాన్ని సమ్మిట్‌లో చర్చ చోటుచేసుకోనుంది. ఈ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ నగరం భారతదేశంలో ఫ్యూచర్ మొబిలిటీ ట్రాన్స్‌పోర్ట్ ఇన్నోవేషన్‌కు ముఖ్య కేంద్రంగా ఎదగనుంది. సాంకేతికత, సస్టెయినబులిటి, సమగ్ర రవాణా విధానాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో మొబిలిటీ రంగంలో ముందంజలో నిలవడానికి ఉపయోగపడనుందని అధికారులు చెబుతున్నారు. ఈ సమ్మిట్ ద్వారా భారతదేశంలో స్మార్ట్, సుస్థిర, సమగ్ర రవాణా వ్యవస్థను అభివద్ధి చేయడానికి అవకాశాలు విస్త్రృతమవుతాయి. స్మార్ట్ సిటీల కోసం కొత్త మొబిలిటీ పరిష్కారాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సాంకేతికత, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆధునీకరణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ స్టార్టప్‌లు ఇన్నోవేషన్ అంశాలపై ఈ సమ్మిట్‌లో చర్చలు జరగున్నాయి. ఈ సమ్మిట్‌లో కేంద్రంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు రవాణా శాఖ అధికారులు, నగర అభివద్ధి సంస్థలు, ఆటోమొబైల్ ఈవీ కంపెనీలు, టెక్నాలజీ సంస్థలు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, అకడమిక్ నిపుణులు పాల్గొననున్నారు.
సుస్థిర నగర రవాణా, ఎలక్ట్రిక్ గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ (మెట్రో, బస్సులు, క్యాబ్స్ సమన్వయం), డిజిటల్ టికెటింగ్, స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్స్‌తోపాటు చివరి మైలు కనెక్టివిటీ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా కొత్త రవాణా విధానాలు, టెక్నాలజీలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాలు , ప్రయివేటు కంపెనీల మధ్య సహకారం పెరగనుంది. నగరాల్లో సురక్షిత, వేగవంతమైన పర్యావరణ హిత రవాణా వ్యవస్థలు అభివద్ధి చెందేందుకు ఈ సమ్మిట్ ఉపయగపడనుందని అధికారిక సమాచారం.
17న నేషనల్ మొబిలిటీ సమ్మిట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



