Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉషాజ్యోతి స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

ఉషాజ్యోతి స్కూల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఉషాజ్యోతి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను శనివారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ గిరి బాబు ఆధ్వర్యంలో సి.వి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా గిరి బాబు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే పరిశోధనాత్మక ఆలోచనలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ సైన్స్ నమూనాలను ఆసక్తిగా తిలకించి, వారి ప్రతిభను అభినందించారు.విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయురాలు రూపశ్రీ, పాఠశాల సైన్స్ టీచర్ వి.అన్వేష్, ఉపాధ్యాయులు సౌందర్య, నిరోష, సుమలత, భార్గవి, వినిత, స్రవంతి, రవీన, నికిత, రూపాలి, హంస, వీణ, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -